Vishwak Sen: రాంచరణ్ అన్న నుంచి నేను ఏమన్నా నేర్చుకునేది ఉందంటే అదే.. విశ్వక్ సేన్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ "ఓరి దేవుడా". ఈ సినిమా తమిళ చిత్రం 'ఓ మై కడవులే' కు రీమేక్ గా వస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు. ఇక విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

Vishwak Sen learn that quality from Ram Charan
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ “ఓరి దేవుడా”. ఈ సినిమా తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’ కు రీమేక్ గా వస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు.
Ram Charan: విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి నేను వీరాభిమానిని.. రాంచరణ్!
ఇక విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “థాంక్యూ సో మచ్ రాంచరణ్ అన్న. నీ సినిమా షూటింగ్ పెట్టుకొని కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు. రాంచరణ్ అన్నలా ఉండడం మాములు విషయం కాదండి. చిరంజీవి గారి కొడుకుగా పరిచయం అవుతున్నారంటే, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఈరోజు వాటిని అందుకోవడమే కాకుండా, అయన నటనతో దేశాలు దాటి మరి వెళ్ళిపోయాడు.
చరణ్ అన్న చుట్టూ ఉన్నవారు.. అయన డిసిప్లిన్ గురించి మాట్లాడతారు. నేను అయన నుంచి ఏమన్నా నేర్చుకునేది ఉందంటే అది అయన క్రమశిక్షణే. ఎందుకంటె నాకు లేనిదే అది” అంటూ వెల్లడించాడు. దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రేమ దేవుడుగా కనిపించబోతున్నాడు.