Vishwak Sen : మొన్న ‘గుంటూరు కారం’, ఇవాళ ‘గామి’.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్.. ఆ ఇష్యూపై లీగల్ గా పోరాడతా..

తాజాగా విశ్వక్ సేన్ గామి సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

Vishwak Sen : మొన్న ‘గుంటూరు కారం’, ఇవాళ ‘గామి’.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్.. ఆ ఇష్యూపై లీగల్ గా పోరాడతా..

Vishwak Sen Serious Reaction on Book My Show Ratings Issue on Gaami Movie

Vishwak Sen : ఇటీవల కొంతమంది హీరోల సినిమాలకు కావాలని నెగిటివ్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో సినిమా బాగోలేదని పోస్టులు చేయడం, బుక్ మై షో(Book My Show) లాంటి ప్లాట్ ఫార్మ్స్ లో టెక్నాలజీ వాడి సినిమాలకు 0 లేదా 1 రేటింగ్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వేరే హీరో అభిమానులో లేక ఆ హీరోని ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

ఇటీవల గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాకు కొంతమంది కావాలని బుక్ మై షోలో 0 లేదా 1 రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వక్ సేన్ గామి(Gaami) సినిమాకు కూడా ఇదే చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం విశ్వక్ సేన్ గామి సినిమా రిలీజయింది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి మంచి విజయం సాధించి ఆల్రెడీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయి ప్రాఫిట్స్ లో ఉంది. కానీ విశ్వక్ సేన్ అంటే నచ్చనివాళ్ళు కొంతమంది ఈ సినిమాకు బుక్ మై షోలో 0 మరియు 1 రేటింగ్ కావాలని ఇవ్వడంతో దీనిపై విశ్వక్ సీరియస్ గా స్పందించాడు.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్..

తాజాగా విశ్వక్ సేన్ గామి సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. గామి సినిమాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు ఆడియన్స్ కి, సినిమా లవర్స్ కి నా కృతజ్ఞతలు. నా దృష్టికి వచ్చిన ఒక సమస్య గురించి మాట్లాడదాం అనుకునున్నాను. సినిమాల మీద పర్సనల్ అటాక్స్, బుక్ మై షో లాంటి వాటిల్లో 1 రేటింగ్ ఇచ్చి సినిమాని దెబ్బ తీయడం లాంటిది చేస్తున్నారు కొంతమంది. మీరు బోట్స్ వాడి ఫేక్ రేటింగ్స్ ఇవ్వడం వల్ల సినిమాకు నిజంగా మంచి రేటింగ్స్ ఇచ్చినా అవి పడిపోతున్నాయి. మీరు నన్ను ఎన్నిసార్లు కిందకి లాగినా నేను చాలా డేంజర్ గా పైకి వస్తాను. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ఇలాంటి సమయంలో మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి, మీడియాకు, క్రిటిక్స్ కు ధన్యవాదాలు. ఈ ఇష్యూపై నేను త్వరలోనే లీగల్ గా ముందుకు వెళ్తాను అని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

దీంతో విశ్వక్ సేన్ పోస్ట్ వైరల్ గా మారింది. గతంలో గుంటూరు సినిమాకు కూడా ఇలాగే చేయడంతో దిల్ రాజు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు విశ్వక్ కూడా ఈ సమస్య ఫేస్ చేయడంతో దీనిపై సీరియస్ అయి కంప్లైంట్ చేస్తాను అని ప్రకటించాడు. విశ్వక్ మాత్రం ఈ సమస్యని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేడు. ఏది ఏమైనా ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ ద్వేషం ఇలా సినిమా మీద చూపించి సినిమాని నాశనం చేయడానికి ప్రయత్నించడం మాత్రం ముమ్మాటికీ తప్పే.