Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్.. కెరీర్ హైయెస్ట్.. విశ్వక్ హిట్ కొట్టాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?

దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది...............

Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్.. కెరీర్ హైయెస్ట్.. విశ్వక్ హిట్ కొట్టాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?

Vishwaksen Das Ka Dhamki Movie Pre Release Business Details

Updated On : March 21, 2023 / 12:39 PM IST

Das Ka Dhamki : యువ హీరో విశ్వక్ సేన్(Vishwaksen) వరుస సినిమాలతో, సక్సెస్ లతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ ఉగాది నాడు మార్చ్ 22న దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki) అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం, నిర్మాణం కూడా విశ్వక్ చేయడం గమనార్హం. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాలో నివేతా పేతురేజ్(Nivetha Pethuraj) హీరోయిన్ గా నటిస్తుంది. ఇక దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది.

 

దాస్ కా ధమ్కీ సినిమా నైజాంలో 3 కోట్లు, సీడెడ్ లో ఒక కోటి, ఆంధ్రాలో 2.8 కోట్లు బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 70 లక్షల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ 7.50 కోట్లు అయింది. దీంతో ఇది విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా నిలిచింది. గతంలో పాగల్ సినిమా 6.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక దాస్ కా ధమ్కీ 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో కనీసం 8 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక హిట్ కొట్టాలంటే కనీసం 10 కోట్లు షేర్ వసూలు చేయాల్సిందే.

Nivetha Pethuraj : విశ్వక్ డైరెక్టర్ గా లోకేశ్ కనగరాజ్ లా సక్సెస్ అవుతాడు.. అతని దగ్గర చాలా కథలు ఉన్నాయి..

అయితే విశ్వక్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి విశ్వక్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తాడా చూడాలి.