Vishwaksen : బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌తో వివాదం పై మీడియా ముందు మాట్లాడిన విశ్వక్ సేన్..

బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌తో జరుగుతున్న వివాదం గురించి విశ్వక్ సేన్ మొదటిసారి మీడియా ముందు మాట్లాడాడు. మన సినిమా బాగుందని ఎదుటవాడిని కించపరచడం..

Vishwaksen reaction on controversy with Baby Movie director Sai Rajesh

Vishwaksen : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ఆడియన్స్ ముందుకు ఒక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మూవీ బేబీ (Baby). హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి స్పూఫ్ చిత్రాలు తెరకెక్కించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ పలు సక్సెస్ మీట్‌లు పెడుతూ వస్తుంది. ఇక ఈ ఈవెంట్స్ లో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “ఆనంద్ కంటే ముందుగా ఒక టాలీవుడ్ యంగ్ హీరోకి కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు.. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా విననని అవమానించినట్లు” చెప్పుకొచ్చాడు.

Ileana D’Cruz : బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఈ హీరోయిన్ ఇప్పుడు ఇలా ఉందో చూశారా..?

అయితే ఆ హీరో ఎవరా అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో.. విశ్వక్ సేన్ తన ట్విట్టర్ అకౌంట్ లో వేసిన ట్వీట్ అందరికి ఒక క్లారిటీ ఇచ్చింది. “నో మీన్స్ నో. కాబట్టి అరవకుండా సైలెంట్ గా కూర్చోండి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి సమాధానంగా సాయి రాజేష్.. “నేను నీ ట్వీట్స్ అన్ని చూస్తున్నాను.. పర్లేదు చేసుకో” అని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదానికి సోషల్ మీడియా వేదిక అయ్యింది. ఇక నెటిజెన్స్ కూడా మీమ్స్ వేస్తూ విశ్వక్ ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వీటన్నిటి పై విశ్వక్ మీడియాతో ముందు ఓపెన్ అయ్యాడు.

Sreeleela : శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా.. అప్పుడే చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసింది..

విశ్వక్ మాట్లాడుతూ.. ఒక సినిమా విషయంలో మనకి ఏమి చేయాలో అని క్లారిటీ లేనప్పుడు ఎదుట వారి టైం వేస్ట్ చేయకూడదని వినను, కుదరదు అని చెబుతాం. దానికి కూడా ఫీల్ అయితే నేనేమి చేయలేను. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే సంతోషించే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక చిన్న సినిమాగా వచ్చి ఇంతటి సక్సెస్ అయ్యిందంటే అది ఇండస్ట్రీ మొత్తం గర్వపడాల్సిన విషయం. దానికి నేను డైరెక్టర్స్ వాట్స్ యాప్ గ్రూప్ లో ఆ చిత్ర దర్శకుడిని కూడా అభినందించాను. అంతెందుకు ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పుడు మొదటి రెస్పాండ్ అయ్యింది కూడా నేనే. అలాంటిది ఆ దర్శకుడు పలు సందర్భాల్లో అదే విషయాన్ని మాట్లాడడం. మన సినిమా బాగుందని ఎదుటవాడిని కించపరచడం అనేది కొంచెం బాధ కలిగించింది.