#SPB బాలుకు విశ్వనాథన్ ఆనంద్ నివాళి..నేనో పెద్ద అభిమాని

  • Published By: madhu ,Published On : September 26, 2020 / 09:54 AM IST
#SPB బాలుకు విశ్వనాథన్ ఆనంద్ నివాళి..నేనో పెద్ద అభిమాని

Updated On : September 26, 2020 / 10:35 AM IST

RIP SPB : లెజండరీ సింగర్ SP Bala subrahmanyam ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన వారు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనకు తాను పెద్ద అభిమాని అని చెప్పారు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్. తన ట్విట్టర్‌ ఖాతాలో ఎస్పీకి నివాళి అర్పించారు.



1983లో జాతీయ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సందర్భంగా తమ జట్టు చెన్నై కోల్ట్స్‌కు బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్‌షిప్‌ అందజేశారని తెలిపారు.  2002 ప్రపంచ కప్‌ అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను కలిసినట్లు ఆనంద్‌ వెల్లడించారు. 13 సంవత్సరాల వయస్సులో నేషనల్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో తమ జట్టుకు ఆయన స్పాన్సర్‌గా వ్యవహరించారన్నారు. దీని ద్వారా..తనకు పేరు వచ్చిందన్నారు. ఎయిర్ పోర్టులో స్పాన్సర్‌షిప్‌ గురించి మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నరు. ఆయనో గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు.



1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు బాలసుబ్రహ్మణ్యం
సాంబమూర్తి, శకుంతల తల్లిదండ్రులు
నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, అనంతపుపరం, చెన్నైలో విద్యాభ్యాసం
ఆయన భార్య పేరు సావిత్రి
ఆయన కుమార్తె పల్లవి, కొడుకు చరణ్
1967లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయం

శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్యతో కలిసి తొలిపాట పాడారు. `ఏమి ఈ వింత మోహము` అనేది తొలిపాట.
1966 డిసెంబర్ 15న ఈ పాటను రికార్డింగ్ చేశారు.
`నక్కరే అదే స్వర్గ` చిత్రంలో పి.సుశృలతో `కనసిదో ననసిదో` తొలి కన్నడ పాట
ఆయన పాట పాడిన `హోటల్ రంభ` అనే తమిళ సినిమా విడుదల కాలేదు.
భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు.
అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.



గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు బాలు.
నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు.
ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ…బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.
బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది.