VJ Sunny : మొన్న నిఖిల్.. ఇప్పుడు VJ సన్నీ.. హ్యాపీడేస్ సినిమాలో నటించడానికి వెళ్తే లంచం అడిగారు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు VJ సన్నీ మీడియాతో మాట్లాడాడు. ఈ మీడియా సమావేశంలో సన్నీ అనేక ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

VJ Sunny : మొన్న నిఖిల్.. ఇప్పుడు VJ సన్నీ.. హ్యాపీడేస్ సినిమాలో నటించడానికి వెళ్తే లంచం అడిగారు..

VJ Sunny Sensational Comments on Happy Days Movies

VJ Sunny : ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ కావాలని చాలా మంది వస్తుంటారు. ఇపుడు టీవీ షోలు, ఓటీటీ, యూట్యూబ్.. ఇలా బోలెడన్ని అవకాశాలు, వేదికలు పెరిగాయని చెప్పొచ్చు. కానీ గతంలో కేవలం సినిమా మాత్రమే. అప్పట్లో సినిమాల్లో ఛాన్స్ కావాలంటే డబ్బులు అడిగేవాళ్ళని, లేదా కాస్టింగ్ కౌచ్ ఉండేదని వార్తలు వచ్చేవి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటుడు VJ సన్నీ కూడా దీనికి బాధితుడినే అంటూ మాట్లాడాడు.

VJ సన్నీ హీరోగా తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘సౌండ్ పార్టీ’ సినిమా. ఇందులో హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తుండగా అమృతం ఫేమ్ శివన్నారాయణ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులని మెప్పించిన సౌండ్ పార్టీ నవంబర్ 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు VJ సన్నీ మీడియాతో మాట్లాడాడు. ఈ మీడియా సమావేశంలో సన్నీ అనేక ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

VJ సన్నీ మాట్లాడుతూ.. నా కెరీర్ ఆరంభంలో సినీ పరిశ్రమలో చాలా కష్టాలు చూశాను. నటుడిగా ఎదగడానికి చాలా ప్రయత్నించాను. కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఏవో కారణాలతో చివరికి సినిమాలో ఉండేవాడిని కాదు. హ్యాపీడేస్ సినిమాలో నన్ను కూడా సెలెక్ట్ చేశారు. నలుగురి హీరోల్లో ఒక పాత్రకు సెలెక్ట్ చేసినా సినిమాలో చేయాలంటే లక్షల్లో డబ్బులు అడిగారు. అంత స్థోమత లేక నేను డబ్బులు ఇవ్వలేక తప్పుకున్నాను అని తెలిపాడు. ఇప్పుడు VJ సన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఇంకో సంవత్సరానికి వాయిదా? ఆ పండక్కి రిలీజ్? నిరాశలో చరణ్ అభిమానులు..

అయితే గతంలో హీరో నిఖిల్ కూడా ఓ సినిమా ప్రమోషన్స్ లో దీని గురించే మాట్లాడాడు. నిఖిల్.. హ్యాపీడేస్ కి సెలెక్ట్ అయ్యాక నలుగురు హీరోల్లో ఒక పాత్ర ఉండాలంటే లక్ష రూపాయలు అడిగారు. వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు అని ఎలాగోలా డబ్బులు సెట్ చేసి ఆ పాత్ర దక్కించుకున్నాను అని తెలిపాడు. ఇప్పుడు VJ సన్నీ కూడా హ్యాపీడేస్ సినిమా గురించి చెప్పడంతో అప్పట్లో హ్యాపీడేస్ సినిమాకి మేనేజర్లు, ఆర్టిస్టులని సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ డబ్బుల కోసం ఎంతమందిని ఇలా ఇబ్బంది పెట్టారో అని కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరు హీరోలు ఇలా చెప్పడంతో మరోసారి హ్యాపీడేస్ సినిమా చర్చగా మారింది. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితులు సినిమా పరిశ్రమలో లేవనే చెప్పొచ్చు.

Also Read : నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సెలెక్ట్ అవ్వడానికి లక్ష లంచం ఇచ్చాడట..