Kushi : ఖుషి సెన్సార్ పూర్తి..! రన్‌టైం ఎంతంటే..?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్.

Kushi
Kushi censor : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం టీజర్, సాంగ్స్, ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
Vijay Deverakonda : తమిళ్ దర్శకుడితో సినిమా కన్‌ఫార్మ్ చేసిన విజయ్ దేవరకొండ..
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యు/ఏ(U/A) సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 45నిమిషాలు. ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. లైగర్ ప్లాప్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవాలని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు.
Vijay Deverakonda : రజిని జైలర్ హిట్ అయ్యి.. భోళాశంకర్ ప్లాప్ అయితే.. చిరంజీవి స్థాయి తగ్గిపోదు..
ఖుషి విడుదలకు సిద్ధం కాగా.. విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. VD12, VD13 వర్కింగ్ టైటిల్స్‌తో అవి తెరకెక్కుతున్నాయి. VD12 మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. పరశురామ్ డైరెక్షన్‌లో VD13 రూపుదిద్దుకుంటోంది.

Kushi censor