Volunteer : ఎన్నికల ముందు ‘వాలంటీర్’ టైటిల్‌తో సినిమా.. స్టార్ రైటర్ నిర్మాతగా..
తాజాగా చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరో కొత్త సినిమా మొదలైంది.

Volunteer Movie Announced Before Elections Under Writer Chinni Krishna Banner
Volunteer : ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన చిన్నికృష్ణ ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరో కొత్త సినిమా మొదలైంది. సూర్య కిరణ్, దీయ రాజ్ జంటగా ప్రసిద్ దర్శకత్వంలో చిన్ని కృష్ణ సారధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత పి. రాకేష్ రెడ్డి నిర్మాణంలో ‘వాలంటీర్’ అనే సినిమాని ప్రకటించారు.
సామాజిక ఇతివృత్తాంతంతో ఈ ‘వాలంటీర్’ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా తిరుపతిలో టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. మా సినిమాలో MLC దువ్వాడ శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. సమాజంలో వాలంటీర్ పాత్ర గురించి చెప్పే సినిమా ఇది. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఎన్నికల ముందు వాలంటీర్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేయడంతో ఆసక్తి నెలకొంది.