Waltair Veerayya: జగదాంబ జంక్షన్‌లో వీరయ్య ఆల్‌టైమ్ వీరంగం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ చిరంజీవిని చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండగ సీజన్‌లో రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ చిరంజీవిని చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండగ సీజన్‌లో రిలీజ్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Waltair Veerayya : ఓరుగల్లు గడ్డపై వాల్తేరు వీరయ్య విజయ విహారం..

బాస్‌ను చాలా రోజుల తరువాత మాస్ సినిమాలో చూడటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు పట్టం కట్టారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. మెగాస్టార్ గ్రేస్‌కు శ్రుతి హాసన్ అందాలు, రవితేజ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోడవడంతో ఈ సినిమాను అభిమానులు బాగా ఆదరించారు. కాగా, ఈ సినిమా పలు ఏరియాల్లో ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేస్తోంది. తాజాగా విజయవాడలోని జగదాంబ థియేటర్లో రూ.1 కోటి రూపాయల కలెక్షన్స్ అతి తక్కువ సమయంలో రాబట్టిన మూవీగా వాల్తేరు వీరయ్య ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసింది.

ఈ ఫీట్‌ను కేవలం 22 రోజుల్లోనే అందుకోవడంతో వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ తన సత్తా చాటాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు