Akshay Kumar : అక్షయ్ కుమార్ కి ఏమైంది.. వరుస ఫ్లాప్స్.. ఓపెనింగ్స్ కూడా రావట్లేదు
ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా అప్లాజ్ అందుకున్న అక్షయ్ కుమార్ కు లాస్టియర్ నుంచి కాలం కలిసి రావడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో......................

what happened to akshay kumar he getting continue flops
Akshay Kumar : ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా అప్లాజ్ అందుకున్న అక్షయ్ కుమార్ కు లాస్టియర్ నుంచి కాలం కలిసి రావడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో 100 కోట్లు ఈజీగా రాబట్టగలిగే స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ కు మంచి పేరుండేది. కానీ బాలీవుడ్ క్రైసిస్ లో పడినప్పటి నుంచీ అక్కీకి కూడా కాలం కలిసి రావడం లేదు. ఒక్క ఇయర్ లోనే ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ చేసి ఆరు ఫలాప్స్ తెచ్చుకున్నాడు అక్షయ్. ఆత్రంగిరే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృధ్విరాజ్, రక్షాబంధన్, కట్ పుత్లీ , రామ్ సేతు లాంటి సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అయ్యాడు. లేటెస్ట్ గా వచ్చిన సెల్ఫీ కూడా దారుణమైన రిజల్ట్ రాబట్టడంతో అక్కీ పూర్తిగా డిఫెన్స్ లో పది ప్రెజర్ ప్రెషర్ ఫీలవుతున్నాడు.
ఒక దాన్ని మించి ఒకటిగా ఫ్లాప్స్ అవుతున్న ఈ టైమ్ లో అక్షయ్ కుమార్ ఎంతో మారాల్సి ఉందని, ఒక బాధ్యత కలిగిన స్టార్ హీరో ఈ రేంజ్ లో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ క్వాలిటీ లేని సినిమాలు తీయడం ఏమాత్రం తగదని అతడి తీరుపై కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఇది తనకి కొత్త కాదని, గతంలో 16 సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయని చెప్పాడు. లైన్ గా 8 సినిమాలు, సెట్స్ పై నాలుగు సినిమాలతో తన ప్లానింగ్ ఉంటుందని, కానీ అవి వర్కవుట్ కాలేదని చెప్పాడు. అందులోను అక్షయ్ వరుసగా రీమేక్ సినిమాలు కూడా చేస్తుండటంతో, అవి కూడా డిజాస్టర్స్ అవుతుండటంతో రీమేక్ సినిమాలు తీయడం ఆపేయమని అభిమానులు, ప్రేక్షకులు కోరుతున్నారు.
కట్ పుత్లీ ట్రైలర్ లాంచింగ్ టైమ్ లోనూ, సెల్ఫీ ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ అక్షయ్ కుమార్ తన సినిమాల రిజల్ట్ పై కన్ఫెస్ అయ్యాడు. ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు అంటే సినిమా బాగాలేదని అర్థం. చేసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సినిమా నచ్చే విధంగా తీస్తే తప్పకుండా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతారు. తన సినిమాలు ఆడకపోవడానికి కారణం తానే అన్నాడు. ఒక సినిమా పట్టాలెక్కడానికి కారణం నేను అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే అది నాదే తప్పు అవుతుందని నిజాయితీగా ఒప్పుకున్నాడు అక్షయ్. అయితే అంత కాన్షస్ ఉన్నప్పుడు మంచి కథలతో సినిమాలు చేయొచ్చు కదా అంటూ అక్కీ తీరుపై మండిపడుతున్నారు. మరి ఇక నుంచైనా అక్షయ్ కుమార్ మారే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. వచ్చే సినిమాలైనా విజయం సాధిస్తాయేమో చూడాలి. ప్రస్తుతం అక్షయ్ చేతిలో మరో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో కూడా ఒక రీమేక్ సినిమా ఉండటం విశేషం.