Citadel : సిటాడెల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్.. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. మరి బాలీవుడ్ లో సమంత లుక్స్ ఎప్పుడు?

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ మెయిన్ లీడ్స్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ ని అమెజాన్ సంస్థ స్వంతంగా నిర్మిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ త్వరలో రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో....................

Citadel : సిటాడెల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్.. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. మరి బాలీవుడ్ లో సమంత లుక్స్ ఎప్పుడు?

Priyanak chopra first look revealed from Citadel series fans want samantha first look from Indian version citadel

Citadel :  హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ మెయిన్ లీడ్స్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ ని అమెజాన్ సంస్థ స్వంతంగా నిర్మిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ త్వరలో రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది సిటాడెల్. తాజాగా ఈ సిరీస్ లో నటించే వాళ్ళ ఫస్ట్ లుక్స్ అని కొన్ని సీన్స్ లోని షాట్స్ ని స్క్రీన్ షాట్స్ తీసి అమెజాన్ ప్రైమ్ అధికారికంగా పోస్ట్ చేసింది.

దీంతో ఈ సిరీస్ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక గన్ పట్టుకొని సైలెంట్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. త్వరలో ఈ సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే సిటాడెల్ సిరీస్ ని బాలీవుడ్ లో కూడా ఇక్కడి ఆడియన్స్ కు తగ్గట్టు స్క్రిప్ట్ ని మార్చి తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో సిటాడెల్ ఇండియన్ వర్షన్ కి సమంతని తీసుకున్నారు. బాలీవుడ్ లో సమంత, వరుణ్ ధావన్ లు మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా ఈ సిరీస్ ని రాజ్, డీకే కలిసి తెరకెక్కిస్తున్నారు. దీంతో సమంత చేసే ఈ సిరీస్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Pathaan Collections : అయిదు కోట్ల దూరంలో.. బాహుబలి ఆ రికార్డుని బద్దలు కొట్టడానికి పఠాన్

ఇప్పుడు హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఇక్కడి అభిమానులు సమంత ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇక ఇండియన్ వర్షన్ లో తెరకెక్కే సిటాడెల్ సిరీస్ సౌత్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారని సమాచారం. మొత్తానికి ఈ గ్రాండ్ సిరీస్ తో అమెజాన్ మార్కెట్లో వేరే ఓటీటీలకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.