Ram Charan : నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా ఈ చిన్న టెంపుల్ ని తీసుకెళతాం.. అమెరికాలో చరణ్, ఉపాసన పూజలు..
తాజాగా రామ్ చరణ్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్, ఉపాసన అమెరికాలో ఇంట్లోనే దేవుడికి దండం పెడుతున్నారు. ఒక చిన్న బాక్స్ లో రాముడు, లక్ష్మణుడు, సీతా దేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మి దేవి చిన్న చిన్న విగ్రహాలు..............

Wherever Ram Charan and Upasana go they carry a small Devotional box with gods idols and pray
Ram Charan : మన సెలబ్రిటీలు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తూనే ఉంటారు. ఇటీవల RRR ఆస్కార్ పుణ్యమా అని రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, చరణ్ ఫ్యామిలీలు పలు దేశాలను చుట్టేశారు. గత కొన్ని నెలలుగా అమెరికాలోనే RRR టీం ఫ్యామిలీలు సందడి చేశాయి. తాజాగా ఆస్కార్ వేడుకకు కూడా ఫ్యామిలీలతో కలిసి వెళ్లారు RRR టీం. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో ఉపాసన కూడా మెరిసింది.
తాజాగా రామ్ చరణ్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్, ఉపాసన అమెరికాలో ఇంట్లోనే దేవుడికి దండం పెడుతున్నారు. ఒక చిన్న బాక్స్ లో రాముడు, లక్ష్మణుడు, సీతా దేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మి దేవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిని చూపిస్తూ రామ్ చరణ్.. నేను, ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఈ చిన్న టెంపుల్ ని తీసుకెళతాం. మా రోజు ప్రార్థనతోనే మొదలవుతుంది అంటూ తన భక్తి గురించి చెప్పాడు.
Balakrishna : గాలా విత్ బాలా.. బాలయ్య ఆహా తెలుగు ఇండియన్ ఐడిల్స్ కి మామయ్య.. అదిరిపోయిన లుక్..
రామ్ చరణ్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. సంవత్సరంలో చాలా రోజులు అయ్యప్ప మాలలోనే కనిపిస్తాడు. ఇక రెగ్యులర్ గా ఆంజనేయస్వామి, శివుడి ఆలయాలకు వెళ్లి పూజలు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా విదేశాలకు వెళ్లినా దేవుడి విగ్రహాలను తీసుకెళ్లి ఎక్కడికి వెళ్లినా మన సంసృతి, సాంప్రదాయాలని మరిచిపోకుండా పూజలు చేస్తుండటంతో మరోసారి ఈ విషయంలో రామ్ చరణ్, ఉపాసనలను అభినందిస్తున్నారు.
. @alwaysramcharan shares with us a sacred ritual he shares with his wife? We are truly in love with this man! ❤️#ramcharan@alwaysramcharan#globalstarramcharan pic.twitter.com/ai1aElwNPW
— Ramesh Bala (@rameshlaus) March 14, 2023