కేటీఆర్ స్పందించారు : ‘కంచెరపాలెం’ నేషనల్ అవార్డ్స్ కు నోచుకోలేదంటే..?

మరి ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా నేషనల్ అవార్డులకు ఎంపిక కాకపోవడం పట్ల చిత్రబృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికాలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రానికి స్వదేశంలో సరైన గుర్తింపు రాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.

  • Published By: sreehari ,Published On : January 12, 2019 / 12:41 PM IST
కేటీఆర్ స్పందించారు : ‘కంచెరపాలెం’ నేషనల్ అవార్డ్స్ కు నోచుకోలేదంటే..?

మరి ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా నేషనల్ అవార్డులకు ఎంపిక కాకపోవడం పట్ల చిత్రబృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికాలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రానికి స్వదేశంలో సరైన గుర్తింపు రాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.

ప్రతి సినిమా నిర్మాణంలోనూ ఎందరో కష్టం దాగి ఉంటుంది. ఏ ఒక్క సినిమా అంత ఈజీగా పూర్తికాదు. పెద్ద సినిమాలు కావొచ్చు.. చిన్న సినిమాలు కావొచ్చు. భారీ బడ్జెట్ కావొచ్చు.. చిన్నమొత్తంలో బడ్జెట్ పెట్టి ఉండొచ్చు. విడుదలైన ప్రతి సినిమా ప్రేక్షకుల ఆధారణ పొందుతుందనే గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు పెద్ద సినిమాలు కూడా బాక్స్ ఫీసు వద్ద బొక్కబోర్లాపడుతుంటాయి. కామన్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు కూడా బాక్స్ ఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. బ్యాక్స్ ఫీసు దగ్గర కలెక్షన్లు కురిపించిన చిత్రాలు కూడా అవార్డులకు నోచుకోలేకపోతున్నాయి. అలాంటి సినిమాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం కేర్ ఆఫ్ కంచెరపాలెం. గత ఏడాది సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కాగా బాక్స్ ఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వైజాగ్ లోని కంచరపాలెం అనే ఊరిలో నలుగురు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ప్రేమజంటల కథే కేఆర్ ఆఫ్ కంచరపాలెం స్టోరీ. ఈ సినిమా రిలీజ్ కు ముందే సినీ ప్రముఖులు, విమర్శకుల దృష్టిని ఆకర్షించింది.  

తెలుగు నుంచి ఎంపికైన తొలి చిత్రం ఇదే..
యంగ్ టాలెంటెడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. న్యూయార్క్ కు చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. స్వీక‌ర్ అగ‌స్తి సంగీత దర్శకుడిగా పనిచేశారు. సురేష్ ప్రొడక్షన్‌లో వచ్చిన కంచెరపాలం చిత్రానికి రానా సమర్పకుడిగా ఉండి ప్రమోషన్ చేయడంతో మరింత ఆసక్తిని రేపింది. అమెరికాలో ఈ చిత్రం తొలిరోజున రూ. 25 లక్షల రూపాయలు (36వేల డాలర్లు) వసూలు చేసింది. కేవలం హైదరాబాద్‌లో ఈ చిత్రం రూ.3.5 లక్షలు వసూలు చేసింది. అంతేకాదు.. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం న్యూయార్క్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు తెలుగు నుంచి ఎంపికైన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. 

సంచలనం రేపుతున్న ట్వీట్..
మరి ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా నేషనల్ అవార్డులకు ఎంపిక కాకపోవడం పట్ల చిత్రబృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికాలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రానికి స్వదేశంలో సరైన గుర్తింపు రాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది. భారత్ లో విడుదలైన ప్రతి తెలుగు చిత్రం.. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. అలాగే కంచెరపాలెం చిత్రం కూడా మంచి హిట్ టాక్ అందుకుంది. కానీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఈ చిత్రం అర్హత పొందలేదనే ఆవేదన చిత్రబృందంలో వ్యక్తమవుతోంది. కంచెరపాలెం చిత్రం నేషనల్ అవార్డులకు అర్హత సాధించకపోవడానికి కారణం.. ఈ చిత్ర నిర్మాత యూఎస్ సిటిజన్ కావడమేనా? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కంచెరపాలెం చిత్రం నేషనల్ అవార్డులకు అర్హత పొందకపోవడంపై పరుచుర్మిడ్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ సంచలనం రేపుతోంది.  

‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రంపై వివక్షను నిరసిస్తూ.. తమ ఆవేదన తెలియజేశారు. ‘డియర్ విజనరీ లీడర్స్.. అంటూ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు కేటీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ వంటి గొప్ప నాయకుల ట్విట్టర్ ఖాతాలను కూడా ఈ ట్వీట్ కు జత చేశారు. కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాన్ని భారత్ లోనే నిర్మించాం. భారతీయ నటులతోనే నిర్మించాం. ఇండియాలోనూ విడుదల చేశాం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. కానీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులకు మాత్రం అర్హత సాధించలేదు. ఎందుకు అర్హత సాధించలేదంటే.. ఈ చిత్ర నిర్మాత భారతీయుడు కాకపోవడమే అసలు కారణమా? అనేది అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. 

ట్వీట్ పై కేటీఆర్ రెస్పాన్స్.. కేంద్రానికి వినతి.. 
ఈ ట్వీట్ పై టీఆర్ఎస్ నేత కేటీఆర్ వెంటనే స్పందించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డులకు కంచెరపాలెం చిత్రం ఎంపికపై కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అరుణ జైట్లీ, ఎంఎస్ రాథోడ్ దయచేసి ఓసారి సమీక్షించాలని కేటీఆర్ అభ్యర్థించారు. ఫిల్మ్ మేకర్లందరికి నేషనల్ అవార్డులు ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. భారత్ లో నిర్మించిన చిత్రాలకు సత్కరించే ఏ అవార్డు తిరస్కరానికి గురికాకూడదు’’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన కంచెరపాలెం బృందం కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు కంచెరపాలెం చిత్రం నేషనల్ అవార్డులకు అర్హత సాధించలేదన్న కింది  ట్వీట్ కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Read Also: నేషనల్ అవార్డుల దరఖాస్తుకు ‘కంచెరపాలెం’ మూవీకి అనుమతి!