Tollywood : ఈ దసరాకు ఇంతే.. టాప్ హీరోలు దూరం ?
Tollywood : దసరా వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు క్యూ కడుతుంటాయి. టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల తర్వాత.. అంతటి క్రేజ్ ఉన్న పండుగ ఇదే.
Why Heroes Avoiding Dasara Releases
Tollywood : దసరా వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు క్యూ కడుతుంటాయి. టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల తర్వాత.. అంతటి క్రేజ్ ఉన్న పండుగ ఇదే. అలాంటి సీజన్‌ను ఇప్పుడు టాలీవుడ్ చేజార్చుకుందా అనే చర్చ జరుగుతోంది. ఈసారి పండుగకు పెద్ద సినిమాల హడావుడి కనిపించడం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు దాదాపుగా తప్పుకున్నారు. విజయ్ దేవరకొండ మాత్రమే ఈ పండుగ బరిలో ఉన్నాడు. పీరియాడిక్ డ్రామా రణబాలితో రేసులో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 16న ఇది రిలీజ్ కానుంది. ఇక అటు సూపర్ స్టార్ట్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2.. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం.. నిజానికి ఈ సీజన్లోనే రావాలి. ఐతే సినిమా వాయిదా పడటంతో దసరా పండగ సీజన్ బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పెద్ద సినిమా తప్పుకోవడంతో ఇండస్ట్రీలోని ఇతర చిన్న చిత్రాలకు సోషల్ మీడియాలో అలాగే థియేటర్లలో మంచి అవకాశం దొరికింది. ఆనంది లీడ్ రోల్ పోషించిన గరివిడి లక్ష్మి సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. లేటెస్ట్గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. తరుణ్ భాస్కర్‌తో కలిసి ఆమె చేసిన క్రేజీ కళ్యాణం.. ఈ నెల 16న తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం పండుగ రోజులలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Sravanthi chokarapu : ఆరెంజ్ శారీలో అదిరిపోయే ఆభరణాలతో.. యాంకర్ స్రవంతి ఫోటోలు..
ఇక ఎంత చిత్రం కదా అనే మూవీ కూడా పండుగకే పలకరించబోతోంది. చిన్న సినిమాలైనప్పటికీ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించడానికి ఇవి రెడీ అయ్యాయి. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా.. పెద్ద హీరోల సినిమాలే పెద్దగా కనిపించడం లేదు ఈసారి ! ఇదే ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. నిజానికి ఈ దసరాకు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయని అంచనాలు కనిపించాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర.. ఈ దసరాకైనా రిలీజ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఆ ఊసే వినిపించలేదు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీతో బాలయ్య కూడా పలకరిస్తాడని అనుకున్నారు. కట్ చేస్తే టీజర్‌తో సరిపెట్టేశారు. నిజానికి ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆలస్యం అయింది. ఆదర్శ కుటుంబంతో అయినా హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకుంటే.. చివరి నిమిషంలో అది కూడా వాయిదా పడింది.
ఓవరాల్‌గా ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ రణబాలి మాత్రమే బాక్సాఫీస్ దగ్గర బరిలో నిలవనుంది. తెలుగు అగ్రహీరోల సినిమాలు ఈ విజయదశమికి లేకపోవడం సినీ ప్రియులను నిరాశకు గురి చేస్తోంది. దీంతో రణబాలి మాత్రమే దసరా బాక్సాఫీస్‌ను శాసించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా ఆయన సతీమణి రష్మిక మందన్నా నటించింది. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి సినిమా కావడంతో.. అంచనాలు మరింత పెరిగాయి. లెనిన్, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడిలాంటి హిట్లతో చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. దసరాతో ఆ స్ట్రీక్ మెయింటేన్ చేస్తూ.. థియేటర్ల దగ్గర హంగామా క్రియేట్ చేస్తారనుకుంటే.. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం.. ఫ్యాన్స్‌లో నిరాశ మిగిలిస్తోంది.
