బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవ‌రో తెలుసా?

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 07:37 AM IST
బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవ‌రో తెలుసా?

Updated On : September 26, 2019 / 7:37 AM IST

బిగ్ బాస్ సీజ‌న్ 3 సక్సెస్ ఫుల్‌గా ప‌దోవారంలోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఇంట్లో తొమ్మిది మంది స‌భ్యులు ఉన్నారు. వారిలో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రవికృష్ణ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 25, 2019) ఇంటి సభ్యులకి పెద్ద సర్ ప్రైజ్ ఇస్తూ వీడియో విడుదలు చేశారు. అదేంటంటే.. బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఓ వ్యక్తి రాబోతున్నారు. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతుంది.

సోషల్ మీడియాలో హౌజ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ వ్యక్తి అలీ రెజా అని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్ర‌వేశించిన త‌మ‌న్నా, శిల్ప చ‌క్ర‌వ‌ర్తి పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. దీంతో నిర్వాహ‌కులు కొత్త వ్య‌క్తిని కాకుండా ఇంటి నుండి వెళ్లిపోయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అలీ రెజానే పంప‌నున్న‌ట్టు స‌మాచారం. అదే కనుక నిజమైతే అలీ అభిమానులకు పండగే.

ఇక ఈ వారం నామినేషన్‌ విషయానికి వస్తే.. శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ లతో పోలిస్తే రవికృష్ణనే వీక్ కంటెస్టెంట్‌ గా క‌నిపిస్తున్నడు. దీంతో సోషల్ మీడియాలో అంతా రవినే ఈ సారి ఎలిమినేట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూద్దాం.