పవన్ “హరిహర వీరమల్లు”కి దెబ్బ.. ఫైనల్‌గా రిలీజ్ అవుతుందని అనుకుంటే.. మళ్లీ కొత్త పంచాయితీ..
ఈ సినిమా జూన్ 12కైనా విడుదల అవుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే?

Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘హరి హర వీరమల్లు’ మొదటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. 2020 జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు.
ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదా పడింది. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. మొదట ఈ సినిమాలోని కొంత భాగాన్ని క్రిష్ రూపొందించారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు.
Also Read: పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి.. ప్లేఆఫ్స్‌లో ఆ జట్టు చేరిక దాదాపు ఖరారైనట్లే.. ఎలాగంటే?
పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడిగా కనపడుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. తొలుత ఈ సినిమాని మార్చి 28న రిలీజ్ చేయాలని అనుకోగా, అది కూడా వాయిదా పడి ఇటీవల కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 12న రిలీజ్ చేస్తామని చెప్పారు.
హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ అవుతుంది. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు షూటింగ్ మొత్తం ముగిసినప్పటికీ ఇప్పుడు ఈ సినిమా జూన్ 12కైనా విడుదల అవుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఎందుకంటే.. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.
ఇక, జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. జూన్‌లో హరిహర వీరమల్లుతో పాటు ధగ్ లైఫ్, కన్నప్ప, కుబేర్, కింగ్డమ్ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు బంద్ అయితే ఆ ప్రభావం వీటిపై కూడా పడనుంది.