పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి.. ప్లేఆఫ్స్‌లో ఆ జట్టు చేరిక దాదాపు ఖరారైనట్లే.. ఎలాగంటే?
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 50, ధ్రువ్ జురెల్ 53 పరుగులు బాదారు.

PIC: @IPL (X)
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌లో ఆ జట్టు చేరిక దాదాపు ఖరారైనట్లే.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 9, ప్రభ్‌సిమ్రన్ 21, మిచెల్ ఓవెన్ 0, నెహాల్ వధేరా 70, శ్రేయాస్ అయ్యర్ 30, శశాంక్ సింగ్ 59 (నాటౌట్), అజ్మతుల్లా 21 (నాటౌట్) పరుగులు చేశారు.
Also Read: పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ ధాటిగానే ఆడింది. అయితే, లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 50, వైభవ్ సూర్యవంశీ 40, సంజు శాంసన్ 20, రియాన్ పరాగ్ 13, ధ్రువ్ జురెల్ 53, షిమ్రాన్ హెట్మెయర్ 11, శుభమ్ దూబే (నాటౌట్), వనిందు హసరంగా 0, క్వేనా మఫాకా 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో 7 పరుగులు దక్కాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 209గా నమోదైంది.