Tiger Nageswara Rao: మాస్ రాజాకి గజదొంగ స్టోరీ ట్రాక్ ఎక్కిస్తుందా?
మాస్ మహారాజ రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని..

Tiger Nageswarara Rao
Tiger Nageswara Rao: మాస్ మహారాజ రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది.
Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు కోసం కొత్త బ్యూటీ..!
జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఒక సెట్ కోసం ఏకంగా కోట్లు కుమ్మరిస్తున్నారనే టాక్ బయటకి రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. కరోనాను కూడా సక్సెస్ వేవ్ గా మార్చుకున్న రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి ఇప్పుడు మంచి జోష్ మీదున్నాడు.
Tiger Nageswararao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం.. ఏకంగా 7 కోట్లతో ఒక్క సెట్..
అయితే, భారీ ఆశలతో వచ్చిన ‘ఖిలాడి’ చిత్రంతో భారీ ప్లాప్ అందుకున్న రవితేజకు ఇప్పుడు మంచి హిట్ కావాలి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్న రవితేజ.. ఆ జోష్ కొనసాగాలంటే మాత్రం సక్సెస్ కావాలి. అందుకే ‘టైగర్ నాగేశ్వరరావు” సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడు వంశీ కూడా అదే కసితో తనను తాను నిరూపించుకోవాలని తపన పడుతున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో.. రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా అన్నది చూడాలి.