Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు కోసం కొత్త బ్యూటీ..!
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా చిత్రాలను లైన్‌లో పెట్టిన రవితేజ....

Nupur Sanon Roped In For Raviteja Tiger Nageswara Rao
Tiger Nageswara Rao: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా చిత్రాలను లైన్‌లో పెట్టిన రవితేజ.. మరో లేటెస్ట్ మూవీని కూడా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. కాగా స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
Raviteja: టైగర్ నాగేశ్వరరావు ఎంట్రీ ఇస్తున్నాడుగా!
కాగా ఈ రోజు ఉదయం టైగర్ నాగేశ్వర రావు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్లు.. అదే రోజున ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాలో రవితేజ సరికొత్త మాస్ అవతారంలో మనకు కనిపించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే ప్రశ్నకు చిత్ర యూనిట్ తాజాగా తెరదించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.
Raviteja: పాతిక రోజులకు అంత రేటా..?
ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్‌లోనూ తన తొలి సినిమాను తాజాగా పూర్తి చేసుకుంది ఈ చిన్నది. అందంతో పాటు అభినయం పరంగా కూడా నుపూర్ సనన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తుండగా, వంశీ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి.ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
Happy to announce that @NupurSanon would be joining @RaviTeja_offl for the Massive Hunt in #TigerNageswaraRao ?@DirVamsee @abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial @UrsVamsiShekar pic.twitter.com/WJ81N9IU7n
— Tiger Nageswara Rao (@TNRTheFilm) March 31, 2022