Venu Udugula : విరాటపర్వం దర్శకుడితో నాగచైతన్య సినిమా..? చైతూ ఆల్రెడీ కథ కూడా వినేశాడట..

తాజాగా వేణు తర్వాత సినిమా నాగచైతన్యతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే వేణు నాగ చైతన్యకి కథ వినిపించినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.

Venu Udugula : విరాటపర్వం దర్శకుడితో నాగచైతన్య సినిమా..? చైతూ ఆల్రెడీ కథ కూడా వినేశాడట..

will Venu Udugula next movie be made with Naga Chaitanya?

Updated On : September 9, 2022 / 8:44 AM IST

 

Venu Udugula :  మొదటి సినిమా ‘నీది నాది ఒకే కథ’తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొంది మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు ఊడుగుల. ఆ తర్వాత రానా, సాయిపల్లవి జంటగా రియల్ గా జరిగిన ఓ కథని తీసుకొని ‘విరాటపర్వం’ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా ప్రేక్షకుల మనసులని హత్తుకుంది. సినిమా మేకింగ్ పరంగా కూడా డైరెక్టర్ వేణు ఊడుగుల మంచి ప్రశంసలే అందుకున్నారు.

Katrina Kaif : మమ్మల్ని విధి కలిపింది.. మా కలయికకి ఏదో బలమైన కారణం ఉంది..

తాజాగా వేణు తర్వాత సినిమా నాగచైతన్యతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే వేణు నాగ చైతన్యకి కథ వినిపించినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరి నాగ చైతన్య ఓకే చెప్తే ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత వేణు చెప్పిన కథ ఓకే అయితే ఈ సినిమా ఉండొచ్చు అని సమాచారం.