Writer Padmabhushan: ఓవర్సీస్లో రైటర్ పద్మభూషణ్ నయా మార్క్..!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై, ఆ తరువాత సినిమాల్లో హీరోగా నటించిన వారి సంఖ్య చాలా తక్కువే. అయితే అలా హీరోలుగా మారినవారు తమ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు.

Writer Padmabhushan Record In Overseas Colections
Writer Padmabhushan: టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై, ఆ తరువాత సినిమాల్లో హీరోగా నటించిన వారి సంఖ్య చాలా తక్కువే. అయితే అలా హీరోలుగా మారినవారు తమ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మల్చుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. కానీ కొంతమంది మాత్రమే సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోలుగా మారి తమ కెరీర్‌ను మల్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అలా హీరోగా మారిన నటుడు సుహాస్, ‘కలర్‌ఫోటో’ మూవీతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సుహాస్ ఇటీవల హిట్-2 మూవీలో నెగెటివ్ రోల్లోనూ నటించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. కాగా, తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇక ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్.. పెద్ద హిట్ కొడుతున్న మరో చిన్న సినిమా..
ఇక తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో ఈ సినిమా వసూళ్ల పరంగానూ మంచి నెంబర్లు నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా అక్కడ ఇప్పటికే 250K డాలర్లు కలెక్ట్ చేసి సినీ వర్గాలను ఔరా అనిపించింది. ఒక చిన్న సినిమాలో కంటెంట్ ఓవర్సీస్ ఆడియెన్స్‌ను ఈ విధంగా ఆకట్టుకోవడం చాలా రోజులయ్యిందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.