Project – K : ప్రాజెక్ట్-K ఆలోచన రావడమే గొప్ప విషయం.. సాయి మాధవ్‌ బుర్రా!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్-K'. ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా దీపికా పడుకోణె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి మాధవ్ ప్రాజెక్ట్-K గురించి మాట్లాడాడు.

Project – K : ప్రాజెక్ట్-K ఆలోచన రావడమే గొప్ప విషయం.. సాయి మాధవ్‌ బుర్రా!

writer Sai Madhav Burra about project k

Updated On : January 6, 2023 / 8:31 AM IST

Project – K : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్-K’. ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా దీపికా పడుకోణె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్వని దత్త్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నాడు.

Project – K : ప్రాజెక్ట్-K నుంచి దీపికా లుక్ రిలీజ్..

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి మాధవ్ ప్రాజెక్ట్-K గురించి మాట్లాడాడు. “ప్రాజెక్ట్-K అనేది పాన్ వరల్డ్ మూవీ. ఆ సినిమా చూసాక దాదాపు రెండు నెలలు పాటు అదే హ్యాంగ్ ఓవర్‌లో ఉంటారు. అంత హంట్ చేస్తది ఆ సినిమా. అసలు అలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. దర్శకుడు నాకు ఆ ఆలోచన చెప్పినప్పుడు, విని షాక్ అయ్యాను. అంత అద్భుతమైన పాయింట్ అది.

బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లేతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు మీరు చూడని విజువల్స్ అన్ని ఆ సినిమాల్లో చూస్తారు. ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు” అంటూ వెల్లడించాడు. అలాగే సినిమాకి సంబంధించిన రైటింగ్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందని తెలియజేశాడు. సినిమా అయితే సంచలనం అవుతుంది అంటూ గట్టిగా చెప్పుకొచ్చాడు.