XY : సి.వి కుమార్ మరో ప్రయోగం.. ‘ఎక్స్ వై’ మోషన్ పోస్టర్ రిలీజ్
రతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ వై’ (XY).
XY Maayavan Cinematic Universe Motion Poster
XY : రతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ వై’. పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దర్శక, నిర్మాత సి.వి కుమార్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై ఎం కె సాంబశివం ఈ చిత్రాన్ని (XY) నిర్మిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ వంటి విషయాలను రివీల్ చేయకుండా ఇదొక ప్రయోగాత్మక చిత్రమని పోస్టర్ ద్వారా తెలియజేశారు.
Prasad Behara : యూట్యూబ్ నుంచి సినిమాల్లో బిజీ అయిన నటుడు..
మోషన్ పోస్టర్ వీడియోలో.. టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, డీఎన్ఏ, ఆ తరువాత రాక్షసుడిలా ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ కొత్త కంటెంట్ ఉన్న మూవీ అని అనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
