Theppa Samudram : ‘తెప్ప సముద్రం’ సినిమా నుంచి.. మంగ్లీ పాడిన పాట విడుదల..

వినాయక చవితి సందర్భంగా సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో”ను ఎమ్ఆర్‌టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేసారు

Theppa Samudram : ‘తెప్ప సముద్రం’ సినిమా నుంచి.. మంగ్లీ పాడిన పాట విడుదల..

Yadunnado Song from Theppa Samudram Movie Sing by Mangli Released

Updated On : September 20, 2023 / 11:34 AM IST

Theppa Samudram song :  శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు.

అయితే వినాయక చవితి సందర్భంగా సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో”ను ఎమ్ఆర్‌టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. “తెప్ప సముద్రం” కథ బాగా నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అయితే ఈరోజు సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో”ను విడుదల చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తా అని తెలిపారు.

Yadunnado Song from Theppa Samudram Movie Sing by Mangli Released

Also Read : Charan – Mahesh : అక్కినేని నాగేశ్వర రావు కోసం ఒకే వేదికపై రామ్ చరణ్, మహేష్ బాబు..

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేసాను. తెప్ప సముద్రం కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. షూటింగ్ అంతా పూర్తి అయింది. వినాయక చవితి సందర్భంగా సింగర్ మంగ్లీ గారు పడిన యాడున్నాడో పాటను విడుదల చేస్తున్నాం. పి.ఆర్ గారు అద్భుతమైన పాటలు అందించారు. సినిమాని త్వరలోనే విడుదల చేస్తాము అని తెలిపారు.