Yamudu : ‘యముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా..

తాజాగా నేడు యముడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Yamudu : ‘యముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా..

Yamudu Movie First Look Released by Producer Raj Kandukuri

Updated On : November 14, 2024 / 5:48 PM IST

Yamudu : జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూనే దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు వహించిన సినిమా యముడు. ధర్మో రక్షిత రక్షితః ట్యాగ్ లైన్. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ చల్లా మరో హీరోగా, శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించారు. తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా యముడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Yamudu

ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ.. యముడు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు, నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ.. మా యముడు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు అలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. శంకర్ గారి అపరిచితుడులోని గరుడ పురాణం కాన్సెప్ట్ మా సినిమాలో ఉంటుంది అని తెలిపారు.

Yamudu