Yatra 2 Song : యాత్ర 2 నుంచి చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..

యాత్ర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా నుంచి తాజాగా చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజయింది.

Yatra 2 Song : యాత్ర 2 నుంచి చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..

Yatra 2 Choodu Nanna Emotional Song Released

Updated On : January 19, 2024 / 2:03 PM IST

Yatra 2 Song : 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్(YSR) బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర సినిమాని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా త్వరలో యాత్ర 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ నటుడు జీవా వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు.

యాత్ర 2 సినిమాని మహి వి రాఘవ్(Mahi V Raghav) దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాత్ర 2 సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులని మెప్పించాయి. యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్ గా చూపిస్తే యాత్ర 2 వైఎస్ జగన్ బయోపిక్ గా రానున్నట్టు తెలుస్తుంది. ఇందులో వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. వంటి అంశాలు ఉండనున్నాయి.

Also Read : Prabhas : ప్రభాస్‌ ఆ డైరెక్టర్స్ వద్దే కంఫర్టబుల్‌గా ఉంటాడట.. పాపం రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా యాత్ర 2 సినిమా నుంచి ‘చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న..’ అంటూ సాగే ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇందులో వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ప్రజలని కలవడం, ప్రజలు జగన్ కి ఆప్యాయంగా స్వాగతం పలకడం, వారి బాధలు చెప్పుకోవడం, వారికి వైఎస్సార్ చేసిన మంచి చెప్పడం వంటివి చూపించారు. చివర్లో దేవుడు అనేది నమ్మకం, వైఎస్సార్ అనేది నిజం అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పించారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారగా వైఎస్సార్ అభిమానులు పాటని అభినందిస్తున్నారు. ఇక యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.