కంటతడి పెట్టించే రాజన్న సాంగ్

యాత్ర నుండి మరుగైనావా రాజన్నా లిరికల్ సాంగ్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : January 29, 2019 / 12:50 PM IST
కంటతడి పెట్టించే రాజన్న సాంగ్

Updated On : January 29, 2019 / 12:50 PM IST

యాత్ర నుండి మరుగైనావా రాజన్నా లిరికల్ సాంగ్ రిలీజ్.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా, యాత్ర. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పల్లెళ్ళో కళ ఉంది అనే సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం, రీసెంట్ గా యాత్ర నుండి మరుగైనావా రాజన్నా, కనుమరుగైనావా రాజన్నా అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. మా ఇంటి దేవుడివే, మాకంటి వెలుగువే, ఒరిగినావా రాజన్నా అనే సాంగ్ గుండె పిండేస్తుంది. వైఎస్సార్ మరణానంతరం ఈ పాట వస్తుందనేది లిరిక్స్ వినగానే అర్థమవుతుంది. అచ్చమైన రాయలసీమ యాసలో అద్భుతమైన పదాలతో గుర్తింపు తెచ్చుకున్న పెంచల్ దాస్ ఈ పాటని రాయడమే కాక, కంటనీరు తెప్పించేలా చాలాబాగా పాడాడు.

మ్యూజిక్ డైరెక్టర్ కె హార్ట్ టచింగ్ ట్యూన్ ఇచ్చాడు. ఫిబ్రవరి 1న యాత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, వై.ఎస్.ఆర్ తండ్రి రాజారెడ్డిగా కనిపించనున్నారు.  ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గారిలీజ్ కానుంది. సంగీతం : కె (కృష్ణ కుమార్), కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.
 

వాచ్ సాంగ్…