మాటిచ్చాక ముందుకెళ్లడమే -యాత్ర ట్రైలర్
యాత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
యాత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాత్ర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, వై.ఎస్.ఆర్ తండ్రి రాజారెడ్డిగా కనిపించనున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, టీజర్ అండ్ సాంగ్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా యాత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రెడ్డి, సో యు హేవ్ టు ఒబే పార్టీ ఆర్డర్స్ అని, సచిన్ కేద్‌కర్, మమ్ముట్టితో అంటే, నా విధేయతనీ, విశ్వాసాన్నీ బలహీనతగా తీసుకోవద్దండీ అని మమ్ముట్టి చెప్పడంతో స్టార్ట్ అయిన యాత్ర ట్రైలర్, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం గానీ, జనాలకి ఏం కావాలో తెలుసుకోలేక పోయాం. తెలుసుకోవాలనుంది, వినాలనుంది, ఈ కడప దాటి, ప్రతీ గడపలోకి వెళ్ళాలని ఉంది అంటూ పాదయాత్ర ప్రారంభించడం వంటి షాట్స్ బాగున్నాయి. రెడ్డి సాబ్, మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి అని ఒక వ్యక్తి అంటే, మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేదేముంది, ముందుకెళ్ళాల్సిందే అంటూ మమ్ముట్టి చెప్పడం చూస్తే, వై.ఎస్.ఆర్ మడమ తిప్పని యోధుడని అర్థమవుతుంది.
గుండె జబ్బు, క్యాన్సర్ కన్నా, పేదరికం పెద్ద శిక్ష, వందలాది కిలోమీటర్ల మేర, కాళ్ళు పగిలేలా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, జనాలు నీరాజనాలు పట్టడం, నాగినీడు, రాజశేఖరా, నువ్వు మారావని నేను నమ్ముతున్నాను, ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు అని చెప్పడం, ట్రైలర్ చివర్లో, హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వ్యక్తి, మమ్ముట్టితో ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే, డాక్టర్ : సార్, తనేమీ మాట్లాడలేడు సార్ అంటే, మమ్ముట్టి, నాకు వినబడుతుందయ్యా అనడం హైలెట్ అని చెప్పాలి. ట్రైలర్‌లో కెమెరా వర్క్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర రిలీజ్ కానుంది.
వాచ్ ట్రైలర్…