జెర్సీ కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఇదే ఇప్పటివరకు హయ్యెస్ట్!

  • Published By: vamsi ,Published On : September 10, 2020 / 10:02 AM IST
జెర్సీ కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఇదే ఇప్పటివరకు హయ్యెస్ట్!

Updated On : September 10, 2020 / 11:39 AM IST

కరోనా వైరస్ కారణంగా దీర్ఘకాలంగా థియేటర్లు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా, కొంతకాలం క్రితం మేకర్స్ తమ సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నారు. OTTలోనే ఇప్పుడు బిగ్ స్టార్స్ సినిమాలు విడుదల అవుతున్నాయి.



బాలీవుడ్ ప్రముఖులు అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు విడుదల చెయ్యడానికి వెనుకాడరు. ఇప్పుడు ఈ స్టార్స్ జాబితాలో షాహిద్ కపూర్ కూడా చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తన యాక్షన్ థ్రిల్లర్ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగిపోతూ ఉండగా.. అన్‌లాక్ కూడా చివరి దశకు రావడంతో బాలీవుడ్‌లోని చాలా మంది పెద్ద నటులు షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తన రాబోయే చిత్రం జెర్సీ షూటింగ్ మొదలు పెట్టేస్తున్నారు.

 

View this post on Instagram

 

#jersey the prep begins.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on




తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్ కబీర్ సింగ్ భారీ విజయాన్ని సాధించిన తరువాత.. నానీ హీరోగా నటించిన జెర్సీ సినిమా రీమేక్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు నానీ. షాహిద్ అభిమానుల అంచనాలు జెర్సీ కోసం ఎదరు చూస్తున్నారు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇఫ్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది.
https://10tv.in/torture-movie-launched/
బొంబాయి టైమ్స్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. షాహీద్ కపూర్ ఈ సినిమా కోసం రూ. 35 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఈ సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇది ఇప్పటివరకు అతిపెద్ద రెమ్యునరేషన్. సినిమా లాభాలలో 20 శాతం వాటా కూడా కోరుతున్నారు.



ఈ సినిమా మాములుగా అయితే 2020 ఆగస్టు 28 న విడుదల కావాల్సి ఉంది. అయితే మహమ్మారి కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. షూట్ ఇంకా పూర్తి కాలేదు.

 

View this post on Instagram

 

#jersey #prep

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on