రాజువయ్యా.. మహరాజువయ్యా..
కరోనా ఎఫెక్ట్ : సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం..

కరోనా ఎఫెక్ట్ : సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం..
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్‌డౌన్ వలన షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది.
దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకొచ్చారు. కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : బోధిధర్మను పిలవమంటున్నారు – శృతిహాసన్
ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన చర్యల కోసం పీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీఎమ్ సహాయ నిధికి) సహాయం అందించారు. ఈ రోజు ‘కరోనా క్రైసిస్ చారిటీ‘ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళంతో ప్రభాస్ కరోనాపై పోరాటానికి మొత్తం 4 కోట్ల 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. నువ్వు సూపర్ డార్లింగ్ అంటూ ప్రభాస్‌ను నెటిజన్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ సంస్థ మరో 10 లక్షల రూపాయల విరాళమందిస్తున్నట్లు తెలియచేశారు.