ఎక్స్‌క్లూజివ్ : ప్రభాస్‌తో నాగ్ అశ్విన్!

‘మహానటి’ దర్శకుడితో ప్రతిష్టాత్మక సంస్థలో ప్రభాస్ సినిమా..

  • Published By: sekhar ,Published On : February 26, 2020 / 07:54 AM IST
ఎక్స్‌క్లూజివ్ : ప్రభాస్‌తో నాగ్ అశ్విన్!

Updated On : February 26, 2020 / 7:54 AM IST

‘మహానటి’ దర్శకుడితో ప్రతిష్టాత్మక సంస్థలో ప్రభాస్ సినిమా..

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ సినిమా నిర్మించనుంది. ఫిబ్రవరి 26న ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

‘సాహో’ తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘రాధేశ్యామ్’ టైటిల్ ప్రచారంలో ఉంది. దీని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏది అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో కొత్త సినిమా ప్రకటన రానే వచ్చేసింది.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కోసం సాలిడ్ స్టోరి రెడీ చేశాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

Read More>>మెట్రోలో ఎంటర్‌టైన్‌మెంట్ – సినిమాలు, సీరియల్స్ ఫ్రీ..

Prabhas New Movie