యూత్ స్టార్ నితిన్ స్టైలిష్ లుక్ చూశారా!

  • Published By: sekhar ,Published On : October 13, 2020 / 08:12 PM IST
యూత్ స్టార్ నితిన్ స్టైలిష్ లుక్ చూశారా!

Updated On : October 13, 2020 / 8:14 PM IST

Nithiin AD Shoot: యూత్ స్టార్ నితిన్ కెరీర్లో మొట్టమొదటి సారిగా ఓ యాడ్‌లో నటిస్తున్నాడు. ఓ పాపులర్ కార్ బ్రాండ్‌కి నితిన్ బ్రాండ్ అంబాసిడర్ ‌గ వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇటీవల ఆ ప్రొడక్ట్‌కు సంబంధించి నితిన్‌పై కొన్ని కమర్షియల్స్ షూట్ చేశారు.


తాజాగా ఆ ప్రకటన తాలుకు పిక్స్ రిలీజ్ చేశారు. కూల్ అండ్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఉన్న నితిన్ లుక్ వైరల్ అవుతోంది. నితిన్ మేకోవర్, డ్రెస్సింగ్ స్టైల్‌కు యూత్ ఫిదా అవుతున్నారు. తన పిక్ షేర్ చేస్తూ ‘తిన్నావా’ అనే క్యాప్షన్ ఇచ్చాడు నితిన్. పాపులర్ క్యారెక్టర్ యాక్ట్రెస్ ప్రగతి కూడా ఈ యాడ్‌‌లో నటించారు.

Nithin

ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన యూత్ స్టార్ కొంత విరామం తర్వాత ‘రంగ్ దే’, ‘చెక్’, ‘అందాధూన్’ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘భీష్మ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు నితిన్.

Nithiin