Varsha Dsouza : అది ఫేక్ వీడియో.. దయచేసి షేర్ చేయకండి.. సోషల్ మీడియాలో యూట్యూబర్ రిక్వెస్ట్
చాలామంది సెలబ్రిటీలు ఫేక్ వీడియోలతో ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా ఓ ట్యూబర్ తన ఫేక్ వీడియో సర్క్యులేట్ అవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Varsha Dsouza
Varsha Dsouza : యూట్యూబర్ వర్ష డిసౌజాకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా వర్ష ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం వర్ష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
YouTube: యూట్యూబర్లకు పెద్ద న్యూస్.. ఇకపై అలాంటి న్యూడ్ కంటెంట్‌కు కూడా డబ్బులు వస్తాయి
వర్ష డిసౌజ.. టిక్ టాక్‌తో దూసుకువచ్చి ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్‌తో దూసుకుపోతోంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎక్కువగా సోషల్ మీడియాలో తన రీల్స్, ఫోటోలు అప్ డేట్ చేస్తూ అందరికీ టచ్‌లో ఉంటుంది వర్ష. తాజాగా వర్ష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం వర్షకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. దీనిపై ఆమె చట్టపరంగా ముందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె పోస్టు చేసారు.
వర్ష డిసౌజ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కొన్నివారాలుగా తన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని.. ఈ అంశం తనను శారీరకంగా, మానసికంగా కుంగదీసిందని తన కుటుంబం కూడా ఆవేదనలో ఉన్నారని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయవాది ఇచ్చిన సూచనతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను తాను అప్‌లోడ్ చేస్తున్నానని.. ఎవరైనా తన వీడియోను సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆ పోస్టులో చెప్పుకొచ్చింది. దయచేసి ఫేక్ వీడియోను ఎవరూ సర్క్యులేట్ చేయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేసింది.
2003 లో వైజాగ్‌లో పుట్టిన వర్ష డిసౌజ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు షార్ట్స్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. అవకాశాలు వస్తే సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది.
View this post on Instagram
View this post on Instagram