పవర్‌స్టార్ ‘పవర్ ఆఫ్ యూత్’ ప్రోమో చూశారా!

  • Published By: sekhar ,Published On : November 27, 2020 / 07:14 PM IST
పవర్‌స్టార్ ‘పవర్ ఆఫ్ యూత్’ ప్రోమో చూశారా!

Updated On : November 27, 2020 / 7:26 PM IST

Yuvarathnaa-Power Of Youth: ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌‌కుమార్ హీరోగా, సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్).. రగ్బీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయేషా సైగల్ కథానాయిక.Yuvarathnaa - Official Teaserశుక్రవారం ‘పవర్ ఆఫ్ యూత్’ తెలుగు ప్రోమో రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పవర్ స్టార్ ఎప్పటిలానే తన స్టైల్‌లో ఎనర్జిటిక్ స్టెప్స్ వేశారు. డిసెంబర్ 2వ తేది మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.



సోనూ గౌడ, ధనంజయ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి.. మ్యూజిక్ : ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ : వెంకటేష్ అంగురాజ్, ఎడిటింగ్ : జ్ఞానేష్, కొరియోగ్రఫీ : జానీ మాస్టర్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, అన్బు-ఆరివు, దిలీప్ సుబ్బరాయన్, విజయ్.