2019లో ఉత్తమ నటుడిగా చిరంజీవి.. ఉత్తమ నటిగా సమంత..

టాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాలకు జీ సంస్థ ప్రతి ఏడాది అవార్డులను ఇస్తుంది. ఈ ఏడాది నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు సంక్రాంతి సంధర్భంగా ముందుగా అవార్డులను ఇచ్చింది ఆ సంస్థ. ఈ కార్యక్రమంలో ‘సైరా’ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా చిరంజీవి, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ సినిమాలకు గాను ఉత్తమ నటిగా సమంత అవార్డు దక్కించుకున్నారు.
జీ సినిమా అవార్డుల విజేతలు:
ఉత్తమ నటుడు: చిరంజీవి (సైరా)
ఉత్తమ నటి: సమంత (మజిలీ, ఓ బేబీ)
బెస్ట్ ఫైన్డ్ ఆఫ్ ది ఇయర్ : శ్రద్ధా శ్రీనాథ్ (జెర్సీ)
ఈ ఏడాది అభిమాన నటుడు: నాని (జెర్సీ)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ కమెడియన్: రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి (బ్రోచేవారెవరురా)
సపోర్టింగ్ యాక్టర్: నీల్ నితీశ్ ముఖేష్ (సాహో)
ఉత్తమ డెబ్యూ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ డెబ్యూ హీరో: ఆనంద్ దేవరకొండ (దొరసాని)
ఫేవరెట్ హీరోయిన్: పూజా హెగ్డే (మహర్షి)
బెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: ఛార్మి (ఇస్మార్ట్ శంకర్)
సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్: రామ్ పోతినేని (ఇస్మార్ట్ శంకర్)
బెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్: పూరీ జగన్నాథ్ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: మణిశర్మ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ గాయకుడు: సిద్ శ్రీరామ్ (కడలల్లే – డియర్ కామ్రేడ్)
జీవిత సాఫల్య పురస్కారం: కళాతపస్వీ కె.విశ్వనాథ్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు(సైరా)
ఫేవరెట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ప్రభాకరన్ (డియర్ కామ్రేడ్)
ఉత్తమ ప్రతినాయకుడు: తిరువే (జార్జిరెడ్డి)
ఉత్తమ స్క్రీన్ప్లే : వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)