కొత్త చట్టం : డాక్టర్లపై దాడి చేస్తే పదేళ్ల జైలు..రూ.10లక్షల జరిమానా
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో

కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు విధించనున్నారు.
వివరాల్లోకి వెళితే.. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. డాక్టర్లు, సిబ్బందిని తీవ్రంగా గాయపరిచిన వారికి 3 నుంచి పదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఇక ఆసుపత్రులపై దాడి చేసి ఆస్తులకు నష్టం కలిగించే వారిని కూడా కఠినంగా శిక్షిస్తారు. వారికి 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు.
కేంద్రం నిర్ణయం పట్ల డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుకి ఆమోదముద్ర పడి కొత్త చట్టం వస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమపై దాడులను అడ్డుకోవడానికి ఈ చట్టం సాయపడుతుందన్నారు. రోగులు మృతి చెందిన సమయంలో.. తామే కారణం అంటూ మృతుల బంధువులు దాడులకు పాల్పడుతున్నారని డాక్టర్లు వాపోయారు. ఆసుపత్రులపై దాడి చేసి విధ్వంసానికి దిగుతున్నారని వాపోయారు. ఈ దాడులను నియంత్రించడానికి, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని డాక్టర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.