Bihar : 100 శాతంతో…ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు ఓపెన్

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.

Bihar : 100 శాతంతో…ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు ఓపెన్

Bihar Cm

Updated On : June 21, 2021 / 7:29 PM IST

Bihar Covid -19 : భారతదేశంలో కరోనా వైరస్ తోక ముడుస్తోంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకటిస్తున్నాయి. పలు రంగాలకు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో ముందటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్, తెరుచుకోవడంతో మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, మాస్క్, శానిటైజ్ చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు తొలగిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. వాణిజ్య సంస్థలు రాత్రి ఏడు గంటల వరకు తెరిచే వెసులుబాటు కల్పించామని, రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

పార్కులు, గార్డెన్లు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని ప్రజలు నిర్లక్ష్యంతో వ్యవహరించవద్దని ప్రజలు సూచించారాయన. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..వైరస్ కు చెక్ పెట్టే విధంగా ప్రజలు సహకరించాలన్నారు.