100 ఏళ్ల మర్రిచెట్టు మాయం: పోలీసుల పరుగులు

బెంగళూరు : నగరంలో అర్థరాత్రి ఓ విచిత్రంగా ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 100 వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవరో తొలగించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఉరుకులు..పరుగులతో దర్యాప్తు ప్రారంభించారు. ఫిబ్రవరి 28 సాయంత్రం కనిపించిన 100 ఏళ్లనాటు అతిపెద్ద మర్రిచెట్టు మార్చి 1 తేవదీకల్లా మాయం అయిపోయింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే అంత పెద్ద చెట్టు ఎలా మాయమైందో తెలియక ఆందోళన చెందారు.
ఈ క్రమంలో చెట్టు మాయమవడంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు స్థానికులు. కావాలనే దానిని నరికివేశారని కొందరు అంటుండగా..కాదు కాదు..అటవీ అధికారులే చెట్టును నరికేసి రాత్రికి రాత్రే అక్కడ నుంచి తరలించేసారని..మరికొందరు ఆరోపిస్తున్నారు. ఆ చెట్టుకు దగ్గరలో ఉండే ఓ షాప్ కీపరే ఎప్పటినుంచో ఆ చెట్టుపై కన్నేశాడనీ..అతనే ఈ పని చేసి ఉండాడని ఇంకొందరు అనుమానిస్తున్నారు. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.