CAAకు వ్యతిరేకంగా 101ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడి నిరసన

CAAకు వ్యతిరేకంగా 101ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడి నిరసన

Updated On : February 8, 2020 / 4:26 PM IST

సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్‌లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవరి 6న పోలీసులు అతనికి ఆందోళన చేసేందుకు అనుమతి లేదని అక్కడి నుంచి పంపేస్తామని హెచ్చరించారు. 

అవేమీ పట్టించుకోకుండా శనివారం ఉదయం 10గంటల 15నిమిషాలకు నిరసనకు దిగిన దొరస్వామి రోజంతా కూర్చున్నాడు. అది చూసిన కొందరు అతనికి ఎండ తగలకుండా షామియానా ఏర్పాటు చేశారు. ఓ పదిహేను నిమిషాల పాటు దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ అది కొనసాగింది. 

పోలీసులు దొరస్వామిని ఎండలో కూర్చొబెట్టే ప్రయత్నం చేసినట్లు ఆందోళన కారులు గుర్తించారు. నగరంలో 30డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ఇది కరెక్ట్ కాదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యాడని, ఫిబ్రవరి 10వరకూ నిరసన దీక్ష పూర్తి చేస్తానంటున్నాడని వారు వెల్లడించారు. 

ఫిబ్రవరి 7న ఆందోళన కొనసాగిస్తాడని దానికి పోలీసులు కూడా అనుమతించారని ఆందోళనకారులు వెల్లడించారు. ‘తర్వాత మేం స్వాతంత్య్రం తెచ్చుకుంటాం. మేం పోరాడతాం’ అని నినాదాలు చేశారు. ఆందోళనకారుల్లో ఒకరు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్లే అంతా నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. 

ప్రజలకు ఉద్యోగాల్లేవు, వ్యాపారాల్లేవు. ఉద్యోగాలు ఎవరిచ్చారని వారు చేయడానికి, వ్యాపారాలే లేకుండా ఏం చేస్తారు అక్కడికి వెళ్లి. మోడీ దేశాన్ని విడగొట్టారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.