కేరళలో కరోనాని జయించిన 103 ఏళ్ల వ్యక్తి

ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో ఒక 103 సంవత్సరాల వ్యక్తి కరోనాను జయించాడు. అంతేకాకుండా తనకి కరోనా వచ్చిందనగానే అయ్యో అని ఇంట్లో వాళ్లు బంధువులు అందరూ నిరాశ పడ్డారు. ఆయన భార్య, కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా సరే పెద్దాయన మాత్రం ‘డోంట్ వర్రీ ఐ విల్ రికవెర్ ’అంటూ వాళ్లకి ధైర్యం చెప్పాడు. మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి గ్రాండ్ సెండాఫ్ చెప్పి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. అతని పేరు పరీద్. అలువా ఏరియాకి చెందిన వ్యక్తి. పరీద్ కేరళలోని ఎర్నాకుళంలో కలమస్సేరీ మెడికల్ కాలేజీలో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు.
103 సంవత్సరాల వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం అనేది యావత్ దేశానికీ మంచి విషయం. ఎందుకంటే… కరోనా అనగానే అమ్మో… చనిపోతామేమో భయపడిపోతున్నారు కొందరు. అదిఏమి లేదంటూ దాని మెడలు వంచి… విజయం సాధించవచ్చని పరీద్ నిరూపించి చూపించాడు. మిగతా పేషెంట్లలో ధైర్యం నింపారు. అంతేకాకుండా డాక్టర్లు, నేతల్లో కూడా ధైర్యం పెరిగింది. “పెద్దవాళ్లను బతికించగలమనే కాన్ఫిడెన్స్ పెరుగుతోంది” అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజా.
105 ఏళ్ల అస్మా బీవీ… కేరళ… కొల్లంలోని పరిపల్లి మెడికల్ కాలేజీలో కరోనాతో చేరారు. మొన్ననే డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా 93 ఏళ్లు, 88 ఏళ్ల దంపతులు కూడా కొట్టాయం మెడికల్ కాలేజీలోనే కరోనాతో చేరారు. ఫుల్లుగా రికవరీ అయ్యి డిశ్చార్జి అయ్యారు.
103 సంవత్సరాల పరీద్ కోలుకోవడానికి 20 రోజులు పట్టింది. జులై 28, 2020న జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆస్పత్రిలో చేర్చితే కరోనా అన్నారు. వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. ప్రత్యేక డాక్టర్ల బృందం.. పట్టుపట్టి మరీ పరీద్ ని బతికించారు. ఆయనలో దూరిన వైరస్ ని తుదిముట్టించింది. అంతకుముందు ఆయన భార్య అమీనా, కొడుకు కూడా అదే ఆస్పత్రిలో కరోనా నెగెటివ్ వచ్చాక డిశ్చార్జి అయ్యారు.