ఇండియా కరోనా వ్యాక్సిన్ వచ్చేది 2021లోనే!

  • Published By: Suresh Kumar ,Published On : September 22, 2020 / 12:46 PM IST
ఇండియా కరోనా వ్యాక్సిన్ వచ్చేది 2021లోనే!

Indian Coronavirus vaccine: కరోనా వ్యాక్సిన్ 2021 నాటికే ఇండియాలో సిద్ధమవుతుందని, మొత్తం 130 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించడం పెద్ద సవాల్ అంటున్నారు సైంటిస్ట్‌లు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ముందుంజలోనే ఉంది ఇండియా.

కాకపోతే ఒకటే సమస్య. దేశీయంగా కరోనా‌స్థాయి వ్యాక్సిన్‌ను తయారుచేసే సదుపాయాలు ఇంకా సిద్ధంకాలేదు.

ఇప్పటిదాకా ఇండియా పిల్లలు, గర్భిణీలకు ఇన్యూనిటీ వ్యాక్సిన్‌లను మాత్రమే అందిస్తోందని అంటున్నారు Vaccine Safety ఎర్పాటుచేసిన WHO’s Global Advisory Committee సభ్యుడు Gagandeep Kang.



ఇంతకీ ఎప్పటికి కరోనా‌వ్యాక్సిన్ రెడీ అవుతుంది? ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. ఆగస్ట్‌నాటికే బీజేపీ ప్రభుత్వం వ్యాక్సిన్ రెడీ అని ప్రకటించాలనుకుంది.

ట్రంప్ ఏకంగా వచ్చే‌నెలలోనే టీకాను ఇస్తామని ప్రకటించేశారు. ఈ రెండు దేశాల్ల్లోనూ సైంటిస్ట్ లు అంత తొందరగా వ్యాక్సిన్ సిద్ధంకాబోదని అంటున్నారు.

కరోనా కేసులు నెమ్మదించడంలేదు. ఇలాంటి సమయంలో ఇండియాలాంటి పెద్దదేశం సేఫ్ వ్యాక్సిన్‌ను తయారుచేయడం మోడీ ప్రభుత్వానికి పెనుసవాల్. దేశ ఆరోగ్యవ్యవస్థకు మరమ్మత్తులు కావాలి. కరోనా వైద్యంలో తప్పడగుగులు పడుతూనే‌ఉన్నాయి.

కరోనా ఇలాగే కొనసాగుతూ పోతే వైద్యసేవలను అందించడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే అలసట కనిపిస్తోంది. డాక్టర్లలోనూ కేసులు పెరుగుతున్నాయి.



ఈయేడాది చివరినాటికి వ్యాక్సిన్ రెడీ‌ఐతే, ఉత్పత్తి, పంపిణీల మీద 2021లో దృష్టిపెట్టొచ్చు.

వ్యాక్సిన్ తయారీదారుల వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్‌కు ఇండియే కేంద్రం. Oxford University తయారుచేస్తున్న వ్యాక్సిన్‌కు Serum Institute of India ఇక్కడే క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తోంది.

Russian vaccineని ఉత్పత్తి, పంపిణీకోసం Dr Reddy’s Laboratories ఒప్పందం కుదుర్చుకుంది. అదీ final-stage human trials పూర్తయిన తర్వాత, ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతనే.
https://10tv.in/covid-19-vaccines-may-available-till-2024-not-enough-for-world-needs-15-bn-doses/
Bharat Biotech International Ltd రెండో దశ హ్యుమన్ ట్రయల్ స్టేజ్ లో ఉంది. మూడోదశ క్లినికల్ ట్రయిల్స్ కోసం సిద్ధమవుతుంది.



మంచి వ్యాక్సిన్ వచ్చిన తర్వాతా వాటిని స్టోరీ చేసి, దేశంలోని అన్నిప్రాంతాలకు పంపిణి చేయడం అంత సలువేంకాదు. దేశమంతటా కరోనాఉంది. మధ్య భారతంలో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటి మధ్య కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలి.

ఇప్పటిదాకా పిల్లలు, గర్భిణీలకు మాత్రమే వ్యాక్సిన్‌లు వేసిన అనుభంమనకుంది. కరోనా వ్యాక్సిన్‌ను అన్ని ఏజ్‌ల వారికీ వేయాలి. mass immunizationకు తగినంత సదుపాయాల్లేవ్. మరేం చేయాలి?
https://10tv.in/indian-doctors-discover-devastating-after-effects-of-covid-19-that-could-last-a-lifetime-as-survivors-reveal-the-symptoms/
antigen testsను నమ్ముకొంది ఇండియా. ఇందులో చాలా తప్పలు. మొత్తం టెస్ట్‌ల్లో 8శాతం పాజిటివిటీ రేట్ కనిపిస్తోంది. World Health Organization చెప్పిన రేటు 5శాతమే. అంటే, పాజిటీవ్ కేసుల్లో తప్పులున్నట్లే కదా.