Srinagar: మసీదులో స్వేచ్ఛా నినాదాలు చేస్తున్న 13మంది అరెస్ట్

జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని..

Srinagar: మసీదులో స్వేచ్ఛా నినాదాలు చేస్తున్న 13మంది అరెస్ట్

Slogans

Updated On : April 9, 2022 / 8:25 PM IST

Srinagar: జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తానీల ప్రభావమేదైనా ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

“ప్రాథమిక విచారణలో భాగంగా పాకిస్తాన్ నుంచి ఏవైనా సూచనలు వంటివి వచ్చి శుక్రవారం ప్రార్థనల్లో అల్లర్లు సృష్టించాలనుకున్నారా అని విచారిస్తున్నాం” అని సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

శ్రీనగర్ లోని పాతబస్తీ మసీదు కేవలం నెల రోజుల క్రితమే రీఎపెనర్ చేశారు. ఇటువంటి నినాదాలు వినపడటంతో వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Read Also : శ్రీనగర్ లో పౌరుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

‘ప్రార్థనల అనంతరం దాదాపు డజను మంది యాంటీ నేషనల్, ప్రోయాక్టివ్ నినాదాలు చేస్తూ ఉండిపోయారు. వారి చుట్టూ గుంపు చేరింది. గొడవలు అదుపుచేయడం కోసం మేనేజింగ్ కమిటీ ప్రయత్నిస్తూనే ఉంది” బల్వాల్ తెలిపారు.

కొద్దిసేపటి తర్వాత బసరత్ నబీ భట్, ఉమర్ మంజూర్ లను అరెస్టు చేశారు. వారితో పాటు మరో 11మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.