Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది కూలీలు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుల్దానా ఎక్స్‌ప్రెస్‌వేపై ఐరన్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది.

Accident
road accident in Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుల్దానా ఎక్స్‌ప్రెస్‌వేపై ఐరన్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. టిప్పర్ వెనుక భాగంలో కూలీలంతా కూర్చుని ఉన్నారు. బోల్తా పడిన సమయంలో ఐరన్ అంతా వాళ్లపై పడడంతో.. 13మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్ మితి మీరిన వేగతంతో నడపటంతో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఐరన్ లోడ్ పై ఉన్న కూలీలంతా కూడా టిప్పర్ కింద పడి చనిపోయారు. ప్రయాణికులంతా నుజ్జునుజ్జయ్యారు. సహాయక చర్యలు ముగిశాయి.
సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే పనుల కోసం ఈ ఐరన్ లోడ్ ను తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతుందని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలం నుంచి జనాన్ని ఖాళీ చేయించారు.