నెమలిని మింగేసిన పాము

  • Published By: Subhan ,Published On : June 1, 2020 / 05:38 AM IST
నెమలిని మింగేసిన పాము

Updated On : June 1, 2020 / 5:38 AM IST

పిట్టల్ని, కప్పల్ని మింగేస్తాయి కానీ, నెమలిని మింగేసిందా అని ఆశ్చర్యం అవసర్లేదు. సగటున 10 నుంచి 20 అడుగుల పొడవుగా ఉండే కొండ చిలువ అది. మిగిలిన పాముల్లా కాకుండా కొండచిలువలు ఆహారాన్ని సులువుగా మింగేస్తాయి. వీటి శరీర నిర్మాణం పెద్ద వాటినైనా మింగేయడానికి అనుకూలంగా ఉంటుంది. 

ఇదంతా జరిగింది ఇండియాలోనే. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో 15అడుగుల కొండచిలువ నెమలిని మింగేసింది. ఝాండా గ్రామస్థులు అటవీ ప్రాంతంలో కొండచిలువను మింగేయడం చూశారట. విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. వాళ్లు వచ్చే సమయానికి కొండచిలువ నెమలిని పూర్తిగా మింగేసి.. అడవిలోకి పారిపోయింది. 

దాని పొడవు 15అడుగులు ఉన్నట్లు గుర్తించగలిగారు. ఇలాగే గుజరాత్‌లోని వడోదరా జిల్లాలో 9అడుగుల పాము పిల్లిని మింగేసింది. గతేడాది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ మొసలిని మింగి ఆకలి తీర్చుకుంది. సాధారణంగా రాళ్లు మింగి తిన్న ఆహారాన్ని అరిగించుకునే మొసలినే మింగేసిందంటే ఈ కొండచిలువకు భయపడని వాళ్లు ఉంటారా.. 

Read: పదకొండు నంబర్లు కావు.. ట్రాయ్ ప్రకటన