Jharkhand : ఝార్ఖండ్ లో పడవ బోల్తా..16 మంది గల్లంతు..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బార్బెండియా వంతెన సమీపంలో గురువారం (ఫిబ్రవరి 24,2022) పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది గల్లంతయ్యారు.

16 Missing As Boat Capsizes In Jharkhand
boat capsized in jharkhand : ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బార్బెండియా వంతెన సమీపంలో గురువారం (ఫిబ్రవరి 24,2022) పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 18 మంది ప్రయాణిస్తుండగా తుఫాను వల్ల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 16మంది గల్లంతు కాగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో నలుగురు ఎలాగోలా ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు.
గల్లంతు అయిన మిగిలినవారి కోసం ఎన్నడీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పడవ బోల్తా పడిన ఘటనలో మొత్తం 16 మంది అదృశ్యమయ్యారని జమ్తారా జిల్లా యంత్రాంగం తెలిపింది. ఝార్ఖండ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధన్ బాద్‌లోని నిర్సా నుంచి జమ్తరకు పడవ వెళుతుండగా.. బార్బెండియా వంతెన వద్ద పడవ బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థనాలనికి చేరుకుని రంగంలోకి దిగారు. నలుగురు బాధితులను కాపాడారు. మిగిలిన 14 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.