uttar pradesh : గంటల తరబడి చెవుల్లోనే ఇయర్ బడ్స్.. వినికిడి శక్తి కోల్పోయిన యువకుడు

ఇయర్ బడ్స్ వాడకం పెరుగుతోంది.. కానీ వీటిని ఎక్కువసేపు చెవి ఏమవుతుందో తెలుసా..గంటల తరబడి ఇయర్ బడ్స్ వాటం వల్ల ఓ యువకుడు ఏకంగా తన వినికిడి శక్తినే కోల్పోయాడు. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వాడితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే..

Using Earbuds UP Boy Turns Deaf : చాలా మంది ఇయర్ బడ్స్ వాడుతుంటారు. ముఖ్యంగా యువత వీటిని బాగా వాడుతున్నారనే చెప్పాలి. స్టైలిష్ లుక్, లైట్ వెయిట్,  వాడకంలో సౌకర్యం వంటి కారణాలతో ఇయర్ బడ్స్ పట్ల ఆకర్షణను పెంచుతున్నాయి. కానీ వీటిని ఎక్కువసేపు చెవి ఏమవుతుందో తెలుసా..గంటల తరబడి ఇయర్ బడ్స్ వాటం వల్ల ఓ యువకుడు ఏకంగా తన వినికిడి శక్తినే కోల్పోయాడు. 18 ఏళ్లకే వినికిడి శక్తి పోగొట్టుకుంటే అది ఎన్ని ఇబ్బందులకు దారి తీస్తుందో అనే ఊహే కష్టమవుతుంది. 18 ఏళ్ల యువకుడు ఈ బడ్స్ ధరించి గంటల తరబడి ఆడియో వింటూ ఉండటంతో అతడు వినికిడి శక్తిని కోల్పోయిన ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో చోటుచేసుకుంది.

Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..

ఇయర్ బడ్స్ గంటల తరబడి వాడటంతో ఆ యువకుడి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో డాక్టర్ల వద్దకు వెళ్లాడు. అతనికి పరీక్షించిన డాక్టర్లు ఎక్కువగా ఇయర్ బడ్స్ వాడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కానీ సర్జరీ వల్ల తిరిగి వినికిడి శక్తిని తెప్పించవచ్చని చెప్పారు. దాంతో ఆ యువకుడు అంగీకరించటంతో డాక్టర్లు సర్జరీ చేసిన తిరిగి వినికిడి శక్తి వచ్చేలా చేశారు.

అందుకే ఇయర్ బడ్స్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వంటివి వాడకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు ఈఎన్టీ నిపుణులు. వీటిని ఎక్కువ సమయం వాడితే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చెవులకు గాలి తగులుతుండాలి. లేదంటే ఇన్ఫెక్షన్ల వస్తుందని చెబుతున్నారు. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ ఎక్కవ సమయం వాడటం వల్ల ఇయర్ కెనాల్ లో తేమ పెరుగుతుంది. అది బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా మారుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Contact Lenses : కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్న యువకుడు

ఒక్కోసారి పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెవి మార్గంలో ఎలాంటివి కూడా ఎక్కువ సమయం పాటు అడ్డు పెట్టకూడదు. పెడితే చెవి లోపల తేమ పెరిగి అక్కడ బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది. ఆదికాస్తా చెవి లోపలికి వ్యాపిస్తే సున్నితమైన కర్ణభేరిపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వంటివి వాడకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ఇయర్ బడ్స్ వంటివి వినియోగించేవారికి సూచనలు..
ఇయర్ బడ్స్ ను గంటల తరబడి ఏకధాటిగా వాడకూడదు..
వాడాల్సి వస్తే కొన్ని నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత తీసి కొంత విరామం ఇవ్వాలి..
ఇయర్ బడ్స్ పెద్ద వ్యాల్యూమ్ లో వినకూడదు.60 శాతం మించి పెట్టుకోకూడదు…
వ్యాల్యూమ్ ను చాలా తక్కువగా పెట్టుకుంటే కాస్త ఉపశమనం..
చెవులను శుభ్రం చేసుకుంటుండాలి..అలాగే ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ శుభ్రంగా ఉంచుకోవాలి..
ఇయర్ బడ్డస్ చెవి లోపలికి వెళ్లేవి కాకుండా చెవి బయట పెట్టుకునే హెడ్ సెట్ ఉపయోగిస్తే మంచిది..
ఒకరు వాడినవి మరొకరు వాడకుండా ఉంటే మంచిది..అది కుటుంబ సభ్యులైనా సరే..

ట్రెండింగ్ వార్తలు