Contact Lenses : కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్న యువకుడు

కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్నాడు ఓ యువకుడు.మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా అతను తన కన్నునే కోల్పోయాడు.

Contact Lenses : కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్న యువకుడు

man lost his eye due to parasites formed under contact lenses

Contact Lenses : ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే కంటి చూపు మందగించేది. ఇప్పుడలా కాదు చిన్నపిల్లలు కూడా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగ రీత్యా కంప్యూటర్లు,లాప్ టాప్ లు వినియోగించటం వల్ల కూడా కంటిచూపుపై ప్రభావం పడుతోంది. టీవీ ఎక్కువగా చూడటం మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా కంటిచూపు సమస్యలను పెంచుతోంది. దీంతో హానికరమైన కిరణాలు కంటిలోపల కార్నియాను పొడిబారేలా చేస్తున్నాయి. ఫలితంగా చూపు మందగిస్తుంది.

దీంతో చాలామంది కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కంటి నిపుణులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించినవారి నిద్రపోయే సమయంలో వాటిని తీసివేయాలి. వాటిని ధరించి నిద్రపోకూడదు. అలా చేస్తే కళ్లే దెబ్బతినే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవటం వల్ల అతని కన్నే కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా ఓ యువకుడు కాంటాక్ట్ లెన్స్ తీయికుండా అలాగే నిద్రపోవటం వల్ల అతని కన్నునే పోగొట్టుకున్నాడు.

Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మైక్‌ క్రుమ్‌హోల్జ్‌ అనే 21 ఏళ్ల అబ్బాయి ఏడేళ్లుగా కాంటాక్ట్‌ లెన్స్‌లు వినియోగిస్తున్నాడు. పగలంతా వాటిని ధరించి తన పనులు చూసుకుని నిద్రించే సమయంలో వాటిని తీసివేసి నిద్రపోతుంటాడు. కానీ కొన్నిసార్లు మర్చిపోయి వాటిని కంటిలో ఉంచుకునే నిద్రపోతుంటాడు. కానీ ఆ మరుపు..లేదా నిర్లక్ష్యం తన కంటినే దెబ్బతీస్తుందని గుర్తించలేకపోయాడు. ఫలితంగా తన కన్నునే కోల్పోయాడు. కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవటం వల్ల మైక్ కంటికి ఇన్ ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది‌. కానీ ఆ విషయం అతనికి తెలియలేదు. కంటిలో ఇబ్బందికర పరిస్థితి రావటంతో డాక్టర్లను సంప్రదించాడు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తరువాత డాక్టర్లు అసలు విషయం చెప్పారు మైక్ కు. మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని చెప్పారు. దీని వైద్య పరిభాషలో అకాంతోమీబా కెరాటైటిస్ అని పిలుస్తారని డాక్టర్లు తెలిపారు.

Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

మైక్‌ క్రుమ్‌హోల్జ్‌ కు డాక్టర్లు పీడీటీ సర్జరీ కూడా చేశారు. కానీ కంటిచూపు మాత్రం కోల్పోవాల్సి వచ్చింది. ఇదొక బాధాకరమైనది అని..నా కుడికన్ను ఏమాత్రం పనిచేయడంలేదని వాపోయాడు మైక్. తన పడే బాధ ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నాడు.తన చికిత్స కోసం గో ఫండ్ మీ పేజ్ ద్వారా సాయం కోరుతున్నాడు. కాంటాక్టు లెన్సులపై అవగాహన కలిగిస్తూ ప్రచారం చేస్తున్నాడు. కాంటాక్టు లెన్సుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే తనలాగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని..కళ్లు కూడా కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నాడు.దానికి నేను ఓ ఉదాహరణ అని క్రుమోల్జ్ చెబుతున్నాడు.

Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..