Lok Sabha : లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం.. పంచెకట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణం చేసిన ఆ ఇద్దరు

18వ లోక్ సభ తొలి సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Lok Sabha : లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం.. పంచెకట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణం చేసిన ఆ ఇద్దరు

LOK SABHA

Lok sabha Members Set To Take Oath : 18వ లోక్ సభ తొలి సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వారణాసి ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేశారు. ఆ తరువాత రాధా మోహన్ సింగ్, రాథ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.. మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది.

ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు. సికింద్రాబాద్ ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ గా నినాదాలు చేశారు. గుంటూరు ఎంపీగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : మా వాటా మాకివ్వాల్సిందే..! కొనసాగుతున్న ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష

లోక్ సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు 279 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన 264 మంది ఎంపీలు రెండో రోజు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఎంపీలు రెండోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

సభ ప్రారంభం కాగానే.. కేరళ రాష్ట్రం వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ప్రొటెం స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్‌, రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానంకు రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ప్రొటెం స్పీకర్ ఆమోదించారు. త్వరలోనే వయనాడ్  నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది.