ఏంటి కారు స్లోగా వెళ్తుందని చెక్ చేస్తే… 8 రాష్ట్రాలను షేక్ చేసే ఆధారాలు దొరికాయ్..
ఆ పేరుతో జరుగుతోన్న మరో భారీ మోసం బయటపడింది.

రోడ్డుపై ఓ కారు స్లోగా వెళుతోంది.. ఏంటి ఆ కారు స్లోగా వెళ్తుందని పోలీసులు చెక్ చేశారు. దీంతో దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను షేక్ చేసే ఆధారాలు దొరికాయి. ఆ కారు యజమాని వద్ద 19 డెబిట్ కార్డులు, 1,600 ఇన్సురెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శంభల్‌లోని రాజ్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది.
రోడ్డుపై పోలీస్ పోస్టు వద్దకు రాగానే ఎస్‌వీయూ కారును డ్రైవర్ మెల్లిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు గమనించారు. పోలీసులకు అనుమానం వచ్చి కారును ఆపారు. ఆ కారు డ్రైవరు ముఖంలో రంగు మారిపోయింది.
దీంతో పోలీసుల అనుమానం బలపడి, వారు ఆ కారును తనిఖీ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు లక్షలాది రూపాయల నగదు, 19 డెబిట్ కార్డులు కనపడ్డాయి. ఈ కార్డులు క్రిమినల్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నవారికి సంబంధించివని పోలీసులు గుర్తించారు.
దీనిపై విచారణ జరపగా, భారీ ఇన్సురెన్స్ స్కామ్ బయటపడింది. ఇక్కడ వ్యవస్థను మోసం చేయడానికి వేర్వేరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నారని పోలీసులు తేల్చారు.
Also Read: సారీ సార్.. అంటూ హీరో విశ్వక్ సేన్ ఆవేదనాభరిత కామెంట్స్.. దయచేసి బలి చేయొద్దంటూ..
గ్రామ పెద్దలు, నగర అధికారులు, ఆశా వర్కర్స్, భీమా సంస్థల ఏజెంట్లు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని గుర్తించారు. వారు నకిలీ పత్రాల ద్వారా, భీమా పాలసీల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు పొందడానికి తప్పుడు వివరాలను నమోదు చేస్తున్నట్లు తేల్చారు.
గత ఏడేళ్లుగా ఈ స్కామ్‌ను దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని చెప్పారు. నేరస్థులు చాలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను వాడుకుంటూ, వారి పేర్లతో జీవిత బీమా పాలసీలను తీసుకుంటున్నారు.
రోగాలతో బాధపడుతున్నవారు కన్నుమూసినప్పుడు, స్కామర్లు వారి కుటుంబ సభ్యులు లేదా డిపెండెంట్లుగా చెప్పుకుంటూ, బీమా డబ్బును తీసుకుంటున్నారు. వారణాసికి చెందిన ఓంకారేశ్వర్ మిశ్రా, అమ్రోహాకు చెందిన అమిత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మృతి చెందిన వ్యక్తుల పేర్లను వాడుకు వీరు పాలసీలను తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. వారి ద్వారా క్రిమినల్ నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.