ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటుంబసభ్యులకు కరోనా సోకింది. యూపీలోని డియోబంద్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ విద్యార్ధిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

Corona Virus
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటుంబసభ్యులకు కరోనా సోకింది. యూపీలోని డియోబంద్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ విద్యార్ధిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అతనితో దగ్గరిగా మెలిగిన 18మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో…రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజలు ఒకచోట ఉండటాన్ని(పబ్లిక్ గేథరింగ్) అనుమతించలేదని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జూన్-30వరకు ఓ ప్లేస్ లో ప్రజలు గుంపులుగా ఉండటాన్ని అనుమతించబోమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది.
కేంద్రప్రభుత్వం ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా పెళ్లి కార్యక్రమాలు,పుట్టినరోజు పార్టీలు మరియు ఎక్కువమంది ప్రజలు ఒక చోట చేరే మరేవిధమైన కార్యక్రమాలను కూడా అనుమతించేది లేదని యూపీ సర్కార్ సృష్టం చేసింది. కాగా,యూపీలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 1694 కు చేరుకుంది. శుక్రవారం, కొత్తగా 139కేసులు నమోదయ్యాయి. 226 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు.
అయితే, వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయి,క్వారంటైన్ లో ఉంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలను లేదా వలస కార్మికులను తిరిగి రాష్ట్రానికి తమ ప్రభుత్వం తీసుకురానున్నట్లు యోగి సర్కార్ తెలిపింది. కాగా,ఇటీవల యోగి సర్కార్ రాజస్థాన్ లోని కోట సిటీలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన తమ విద్యార్ధుల కోసం 300బస్సులనుపంపి వాళ్లను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లోని క్వారంటైన్ సెంటర్లలో యూపీకి చెందిన వాళ్లు 5లక్షల మందికి పైగానే ఉండి ఉండవచ్చని యోగి ప్రభుత్వం అంచనావేసింది.